మంగళగిరిపై నారా లోకేష్ గత ఎన్నికల ఓటమి తర్వాత నుండి ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లోకేష్ ఇప్పటికే మంగళగిరి వాసుల జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తున్నారు. ఇక మంగళగిరిలో మహిళల ఆర్ధిక స్వావలంబనకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ స్త్రీశక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని ఈరోజు నారా బ్రాహ్మణి సందర్శించారు. ఈరోజు మంగళగిరి లో వీవర్ శాల ప్రారంభంలో టాటా తనేరా సీఈవో అంబుజ నారాయణతో కలిసి హెరిటేజ్‌ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణి అక్కడ ఏర్పాటు చేసిన వీవర్‌శాలను ప్రారంభించారు. అనంతరం వీవర్‌శాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నారా బ్రహ్మణి వీవర్‌శాలలో ఏర్పాటు చేసిన ఆధునాతన చేనేత మగ్గాలను పరిశీలించారు.
మంగళగిరిలో స్త్రీశక్తి కేంద్రాన్ని సందర్శించిన నారా బ్రహ్మణి మహిళలతో మాట్లాడి వారికి అందుతున్న శిక్షణ గురించి అడిగి తెలుసుకున్నారు. నారా లోకేష్ నెలకొల్పిన స్త్రీశక్తి ఎంతో మంది నుంచి ప్రశంసలు అందుకుంటుందని నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. మంగళగిరి మహిళలకు స్త్రీశక్తి ఎంతగానో దోహదపడుతుందని నారా బ్రహ్మణి పేర్కొన్నారు. ఇప్పటికే 47 బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు అందించడం జరిగిందని, మంగళగిరి, తాడేపల్లి పట్టణాలతో పాటు దుగ్గిరాలలో ప్రతి రోజు 13 బ్యాచ్‌లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని పేద మహిళల ఆర్థికాభివృద్ధే లోకేష్ లక్ష్యం అని నారా బ్రాహ్మణి వెల్లడించారు. నిరంతరం మంగళగిరి అభివృద్ధి గురించే నారా లోకేష్ ఆలోచన అని నారా బ్రాహ్మణి పేర్కొన్నారు.
నియోజకవర్గ ప్రజల కోసం నారా లోకేష్ 27 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని బ్రాహ్మణి వెల్లడించారు. మరో రెండు నెలల్లో మంగళగిరి రూపురేఖలు మారబోతున్నాయి అని నారా బ్రహ్మణి తెలిపారు. త్వరలో ఎన్నికలు జరగనున్న క్రమంలో బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మరో రెండునెలల్లో మంగళగిరి రూపురేఖలు మారబోతున్నాయి అన్న వ్యాఖ్యల వెనుక లోకేష్ మంగళగిరిలో గెలుస్తారు అన్న నారా బ్రాహ్మణి విశ్వాసం ఉంది.
Tags
Andra Pradesh