చింతలపూడి: బిజెపి ప్రభుత్వ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా మరియు కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా చింతలపూడి పట్టణంలో పారిశ్రామిక సమ్మె లో భాగంగా బైపాస్ రోడ్డు వద్ద నుంచి పాత బస్టాండ్ బోసు బొమ్మ సెంటర్ మీదుగా ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు ఏఐటియుసి, సిఐటియు అనుబంధ కార్మిక సంఘాలైన ముఠా కార్మికులు మున్సిపల్ కార్మికులు అంగన్వాడీ ఆశ, ఏపీ రైతు సంఘం కార్యకర్తలు వ్యవసాయ కార్మికుల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించడం జరిగింది.
అనంతరం ఫైర్ స్టేషన్ వద్ద జరిగిన రాస్తారోకో కార్యక్రమానికి సిఐటియు మండల అధ్యక్షులు నత్త వెంకటేశ్వరరావు ఏ ఐ టి యు సి జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి తొర్లపాటి బాబు అధ్యక్షత వహించగా దీనిని ఉద్దేశించి ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పుల్లూరి సోమశేఖర్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ వి సత్యనారాయణ ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి దొంత కృష్ణ మాట్లాడారు. ఈ సార్వత్రిక సమ్మెకు సిపిఐ మండల కార్యదర్శి కంచర్ల గురవయ్య సంఘీభావం తెలిపారు.
ఈ ప్రదర్శనలో ముఠా కార్మికులు వీరబాబు, నాగు, శ్రీను, మున్సిపల్ కార్మికులు వెలగాడి అనురాధ, వెలగాడి పద్మ, విజయరాజు, సిఐటియు మండల కార్యదర్శి బాలరాజు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డి సత్యనారాయణ, ముల్లగిరి అలెగ్జాండర్, అంగన్వాడి వర్కర్స్ జి అంజమ్మ, సరోజినీ, మాణిక్యం, జి సరళ, ఆశా వర్కర్స్ సరళ, ఏపీ రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.